కరోనా ప్యాండెమిక్ తో అన్ని వ్యాపారాలు డల్ అయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత గోల్డ్ కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆషాడం, శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళ సీజన్ తో బంగారం కొనుగోళ్లు బాగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. రేట్స్ తటస్థంగా ఉన్నాయని.... భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్ లో మార్పులతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
గత ఏడాది కరోనాతో పండగలు, పెళ్లిళ్లు లేకపోవడంతో గోల్డ్ సేల్స్ తగ్గాయి. ప్రస్తుతం సిటీలో మళ్లీ అమ్మకాలు జోరందుకున్నాయి. మొన్నటి దాకా శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో బంగారం షాపుల్లో కస్టమర్లతో రద్దీ పెరిగింది. ఆషాడం, శ్రావణ మాసంలో గోల్డ్ కొనేవారి సంఖ్య పెరిగిందిం. గత ఏడాది కోవిడ్ కారణంగా పెళ్లిళ్లు ఆగిపోవడంతో సేల్స్ అంతగా లేవని.. ఈ ఏడాది సెకండ్ వేవ్ అన్ లాక్ తర్వాత దాదాపు 80శాతం వరకు బంగారు ఆభరణాల సేల్స్ పెరిగాయంటున్నారు వ్యాపారులు. బ్రైడల్ జువెలరీ కలెక్షన్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధరలు స్టేబుల్ గా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. నెల రోజులుగా దేశీయంగా గోల్డ్ రేట్స్ లో అంతగా వేరియేషన్ లేదంటున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద పండుగలైన దసరా, దీపావళికి సేల్స్ మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 48వేలు ఉండగా.. 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ 44 వేలుగా ఉంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా మార్పులు, క్రూడాయిల్ ధరలు పెరగడం లాంటి ప్రభావాలు ఉంటాయి. దాంతో ఇండియాలో గోల్డ్ పై ఇన్వెస్ట్ మెంట్స్ పెరిగితే.. మళ్లీ దేశీయంగా బంగారం ధరలు పెరిగే అవకాశాలే ఉన్నాయంటున్నారు.
హైదరాబాద్ సిటీలో పెళ్ళిళ్ళ సీజన్, బిగ్ ఫెస్టివల్స్ లేకపోవడంతో ప్రస్తుతం కొనుగోళ్లు కాస్త తగ్గాయని చెబుతున్నారు. అయితే బంగారం కొనడానికి ఇదే రైట్ టైమ్ అంటున్నారు. ఎప్పటికైనా ఇన్వెస్ట్ మెంట్ పరంగా బంగారంపై పెట్టుబడి సేఫ్ అని చెబుతున్నారు. అఫ్గనిస్తాన్ లాంటి దేశాల్లో అనిశ్చితి, క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగడం, యూఎస్ లో డాలర్స్ తో రూపాయి మారకం తగ్గడం లాంటి ప్రభావాలతో గోల్డ్ పై మళ్లీ ఇన్వెస్ట్ మెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దాంతో రేట్లు కూడా పెరిగే అవకాశముంది. గత ఏడాది నుంచి లాక్ డౌన్ లు, కరోనాతో ఇబ్బందులు పడుతున్న జువెలరీ వ్యాపారం ప్రస్తుతం సాధారణ పరిస్థితికి చేరుకుందంటున్నారు. కోవిడ్ టీకాలు వేయించుకోవడంతో పాటు, కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తూ బంగారం అమ్మకాలు చేస్తున్నామంటున్నారు జువెలరీ వ్యాపారులు.
